About us

మిత్రులారా... తెలుగుదేశం ఆస్త్రైలియా  స్థాపించాలన్న నిర్ణయం ఏదో ఆవేశంలోనో, రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ఇంకేదో రాజకీయ ప్రయోజనాల కోసమో, మరో దాని కోసమో తీసుకున్న నిర్ణయం అంతకంటే కాదు. దీని వెనుక మూడేళ్ల మానసిక సంఘర్షణ ఉంది. ఆస్త్రైలియా లో ఉన్న తెలుగు వాళ్ళ ఏదో చేయాలన్న తపన ఉంది. ఒక్క వ్యక్తి మూడేళ్ళ పాటు తన మిత్రులు, సన్నిహితులు, తెలిసిన వాళ్ళందరితో జరిపిన సంప్రదింపులు, తీసుకున్న సలహాల పరంపరలో నుంచి పుట్టుకొచ్చిందే తెలుగుదేశం ఆస్త్రైలియా. సంస్థ చూస్తే టిడిపికి అనుబంధంగా ఉంది. మీరేమో రాజకీయ ప్రయోజనాలు లేవంటున్నారన్న అనుమానం ప్రతి ఒక్కరికీ రావడం సహజం. దీనికి కూడా సమాధానం ఉంది.   
మనం అందరం ఉన్న ఊరును, కన్న తల్లిని వదిలి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. బతుకు పోరులో, డాలర్ల వేటలో వచ్చిన వాళ్ళు కొందరైతే.. ఉన్నత చదువులు చదవాలని, సమున్నత శిఖరాలు ఎక్కి, మన సత్తా చాటాలని వచ్చిన వాళ్ళు మరికొంతమంది. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. తెలుగమ్మ పిల్లలమే. కానీ అవసరాల రీత్యా ఆస్త్రైలియా లో ఎక్కడెక్కడో ఉంటున్నాం. మన అందర్నీ ఒక్కటి చేసే వేదిక ఒకటి కావాలి. ఆపదలో ఉన్న తెలుగువారిని ఆదుకోవడానికి.. కొత్తగా వచ్చి ఇక్కడి పరిస్థితులు తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయడానికి ఓ అండ కావాలంటూ ప్రకాశం జిల్లా తూర్పు కొప్పెరపాడు నుంచి వచ్చిన శ్రీ యెనికపాటి వెంకటేశ్వరరావు గారి మదిలో వచ్చిన ఆలోచనల ప్రతిరూపమే తెలుగుదేశం ఆస్త్రైలియా. ఆయనే మన సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షులు. సాయం చేసే సంస్థ కావాలనుకున్నప్పుడు తెలుగుదేశమే ఎందుకు.. వేరే సంస్థ పేరు పెట్టవచ్చుకదా అని వెంకటేశ్వరరావు గారికి చాలా సూచనలు వచ్చాయి. కానీ ఏదో ఒక పేరు పెట్టి.. ఎలాగోలా కొన్నాళ్ళు లాగించేసి, తర్వాత కులాలు, మతాలు ప్రాంతాల వారీగా విడిపోవాలన్నది మన లక్ష్యం కాదు. అందుకే తెలుగుదేశం ఆస్త్రైలియాను ఎంచుకున్నాం. తెలుగుదేశాన్ని రాజకీయ పార్టీగా చూడటానికి ముందు అది తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. వేలెత్తి చూపడానికి లేని వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి , రాజకీయ శతృవులు సైతం అభిమానించే నందమూరి తారక రామారావుగారి మానస పుత్రిక. ఆస్త్రైలియాలోని తెలుగువాళ్ళని ఒక్కటి చేసేందుకు పెట్టాలనుకున్నాం కాబట్టి నాటి ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుజాతి ఆత్మగౌరవాన్నే ఎంచుకున్నాం.
2009 జూన్ 28న వెంకటేశ్వరరావు గారికి ఆలోచన రాగా 2012 అక్టోబర్ 28న తెలుగుదేశం ఆస్త్రైలియా  ప్రారంభమైంది. వైవీ.. వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆయన ఆలోచనల్ని సమర్ధించి వెన్ను తట్టి ప్రోత్సహించిన 17 మంది ప్రాధమిక సభ్యులతో  గోదావరి జిల్లాకు చెందిన ఐటి నిపుణుడు శ్యాంప్రసాద్ కోడూరి గారు కార్యదర్శిగా, మరో ఐటి నిపుణుడు అజిత్ వీరపనేని గారు కోశాధికారిగా  సంస్థ ప్రారంభమైంది. తర్వాత మూడు నెలలకు జరిగిన ఎన్నికల్లో శ్యాంప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు సమావేశాలు నిర్వహించుకుంటూ తెలుగుదేశం ఆస్త్రైలియా ముందుకు వెళ్తుంది. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంచాలన్న నిర్ణయం కూడా మొదట్లో ఏకపక్షంగా తీసుకున్నది కాదు. సభ్యులందరి సమక్షంలో చర్చించి ప్రజాస్వామ్యయుతంగా తీసుకున్న నిర్ణయం అది. అలా ఒక్క వ్యక్తికి వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చి 17 మందితో సంస్థగా మొదలై ప్రస్తుతం 400 మందితో కళకళలాడిపోతోంది
ప్రతిసంవత్సరం తెలుగుదేశం ఆస్త్రైలియా  ఆధ్వర్యంలో ఏటా సంక్రాంతి సంబరాలు, కార్తీక వన భోజనాలతో పాటు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్ని జరుపుకుంటున్నాం.  తెలుగు సంస్కృతిని ప్రోత్సహిస్తూ, రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రతికూల పరిస్తితులలో అనేక విధాలుగా మాతృభూమి లో ఉన్న వారికి సహాయపడుతున్నాము. స్థాపనలో భాగాస్వామ్యులైన సభ్యులకు, కార్యకర్తలకు, దాతలకు, మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న తెలుగువారందరికీ ఇవే మా హార్దిక శుభాభినందనములు..............

Executive Team
  • Venkatesh Yenikapati
 up